GNTR: తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్ స్మశానవాటిక వద్ద మంగళవారం రాత్రి కొండచిలువ ప్రత్యక్షమైంది. దీన్ని చూసిన స్థానికులకు గుండె ఆగినంత పనైంది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. సుమారు 7 అడుగుల మేర ఉన్న కొండచిలువను చంపేసినట్లు స్థానికులు చెప్తున్నారు. అటవీశాఖ అధికారులు కొండ ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.