KMM: క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో చట్టం అమలుపై సమీక్షించారు. యాక్ట్ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన పరికరాల కొనుగోలు నిబంధనల ప్రకారమే జరగాలని ఆమె సూచించారు.