MHBD: ఈనెల 24, 25 తేదీలలో జరిగే CITU రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని MHBD జిల్లా అధ్యక్షులు కుంట నాగన్న పిలుపునిచ్చారు. మానుకోట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించడానికి ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అధిక సంఖ్యలో కార్మికులు హాజరుకావాలని కోరారు.