GNTR: మంగళగిరి- కాజా టోల్ గేట్ నుంచి కాజా గ్రామంలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్డులో గుంతలు ఏర్పడడంతో ప్రయాణించడానికి ఇబ్బందికరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో వాహనాలు, వర్షము పడిన సమయంలో నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరారు.