ఆసిఫాబాద్ జిల్లాలో పీఎం శ్రీ పథకానికి ఎంపికైన 15 పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్, DEO దీపక్ తివారి ఒక ప్రకటనలో తెలిపారు. బ్లాక్ బెల్ట్ కలిగిన మాస్టర్లు ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని DEO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మహిళా కరాటే మాస్టర్లకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.