SRCL: సీపీఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సీపీఆర్‌పై వైద్యులు రామకృష్ణ, వేణుమాధవ్ శిక్షణ ఇచ్చారు. వ్యక్తుల గుండె ఆగిపోయినపుడు, శ్వాస ఆగిపోయన సందర్భంలో అత్యవసర చికిత్సలో భాగంగా సీపీఆర్ చేసే విధానంకు ముందు వ్యక్తి స్థితిని పరిశీలించాలన్నారు.