ADB: మాదక ద్రవ్యాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాటి వల్ల కలుగు అనర్థాలను వారికి వివరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఉట్నూర్ సబ్ డివిజనల్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అదనపు ఎస్పీ కాజల్ సింగ్, తదితరులున్నారు.