VZM: విజయనగరం జడ్పీ గెస్ట్ హౌస్‌లో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఇవాళ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం మరో కొత్త మైలురాయన్నారు. ఈ మేరకు వేల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఐటీ సెక్టార్లో రావడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబుకు, లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.