WGL: అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ప్రైవేట్ OSD ఎన్.సుమంత్‌ను పదవి నుంచి తొలగించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు షాక్ ఇచ్చింది. అటవీ శాఖలో డిప్యూటేషన్లు, బదిలీలు సుమంత్ సూచనల ప్రకారమే జరిగేవనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఐఏఎస్ అధికారులకు ఆర్డర్లు వేసే స్థాయికి అతడు ఎదిగాడని విమర్శలు వచ్చాయి. పాలనాపర కారణాలతో పీసీబీ టర్మినేషన్ ఆర్డర్ జారీ చేసింది.