TG: తెలంగాణలో సాజిద్‌పై ఎలాంటి క్రైమ్ రికార్డులు లేవని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. HYDలో సాజిద్ బీకామ్ చదివినట్లు పేర్కొన్నారు. ‘యూరోపియన్ యువతి వెనెరా గ్రోసోను సాజిద్ పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత ఆయన భారత్ కు 6 సార్లు వచ్చాడు. సాజిద్ కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇప్పటికీ సాజిద్ ఇండియా పాస్ పోర్టు కలిగి ఉన్నాడు’ అని వెల్లడించారు.