New Smart Watches in the Market.. Features... Prices
Smart Watches: మార్కెట్లో స్మార్ట్ వాచ్లకు మంచి డిమాండ్ ఉంది. అందుకే పెద్ద కంపెనీలు పోటీపడుతున్నాయి. అందులో భాగంగా స్మార్ట్ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ నాయిస్ ఇండియా మరో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. నాయిస్ఫిట్ ఆరిజిన్ (NoiseFit Origin) పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రీమియం గ్యాడ్జెట్లో కొన్ని అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ వాచ్‌లు జెట్ బ్లాక్, సిల్వర్ గ్రే, మిడ్నైట్ బ్లాక్, మొజాక్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, క్లాసిక్ బ్రౌన్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. రూ.6,500 కు అందుబాటులో ఉన్న ఇందులో మంచి ఫీచర్లు ఉన్నాయి.
గోనాయిస్.కామ్ సహా క్రోమా స్టోర్లలో జూన్ 7 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అంతే కాకుండా ఆన్లైన్ మార్కెట్స్ అయినా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లోనూ అందుబాటులో ఉంటాయి. ఇందులో బీపీ, హార్ట్‌రేట్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్, ఫీమేల్ సైకిల్, స్లీప్, స్ట్రెస్ ట్రాకర్లు సహా ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఫీచర్లు ఉన్నాయి. 1.46 అంగుళాల అపెక్స్విజన్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. దీనిలో ఈఎన్ 1 ప్రాసెసర్ ఉంది. అలాగే బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉంది. ఇక బ్యాటరీ లైఫ్ టైమ్ ఏడు రోజులు ఉంటుంది.