WGL: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ప్రజలకు ఆసరాగా, బాధితులకు ఊతమిచ్చేలా ఈ టూర్ ఉంటుందని వరంగల్ బాద్యులు తెలిపారు. రెండు రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని, జనాలను కలుస్తూ.. స్థానిక సమస్యలపై అవగాహనే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, మొదటగా హనుమకొండ, వరంగల్, నర్సంపేట, పరకాలలో పర్యటన ఉంటుందన్నారు.