»These Are The Foreign Leaders Who Will Come To Modis Oath Taking Ceremony
PMModi: మోడీ ప్రమాణ స్వీకారినికి వచ్చే విదేశీ నేతలు వీరే
ఇండియాకు హైట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారినికి ముహుర్తం ఫిక్స్ అయింది. ఆ వేడుకకు విదేశాల నుంచి ముఖ్యనేతలు హాజరు అవుతున్నారు. ఏన్టీయే పూర్తి మద్దతు ఇవ్వడంతో మోడీనే మరోసారి పీఏం అవుతున్నారు.
These are the foreign leaders who will come to Modi's Oath taking ceremony
PMModi: దేశంలో నెలకొన్న ఉత్కంఠ నిన్నటితో తీరింది. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇండియా కూటమి సైతం పావులు కదిపే దిశగా కదులింది. దీంతో దేశ ప్రజల్లో పీఎం ఎవరు అనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి నరేంద్రమోడిని బలపరిచారు. దీంతో మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖరారైంది. ఈ నెల జూన్ 8న ప్రధానిగా ఆయన ప్రమాణస్వీకార చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విదేశీ మహోత్సవం(swearing-in ceremony) ఉండనుంది. దీనికి విదేశీ నేతలు హాజరుకానున్నట్లు తెలుస్తుంది.
బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలకు ఆహ్వానం అందించనున్నారు. శ్రీలంక అధ్యక్షుడి రణిల్ విక్రమసింఘేకు ఇప్పటికే ఆహ్వానం అందిందని ఆ దేశ మీడియా కార్యాలయం తెలిపింది. ఇక బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను మోడీ స్వయంగా ఆహ్వానించినట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. ఇతర నేతలకు అధికారిక ఆహ్వానాలు వెళ్లనున్నాయి. ఇక మోడీ మొదటి సారి ప్రధానిగా 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సార్క్(SAARC) దేశాల అధినేతలు హాజరయ్యారు. రెండవసారి 2019లో బిమ్స్టెక్ (BIMSTEC) దేశాల నాయకులు హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు మన దేశ ఇరుగుపొరుగువారిని ఆహ్వానిస్తున్నారు.