»Moto Earbuds Moto New Earbuds These Are The Features
Moto Earbuds: మోటో కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు ఇవే!
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ మోటో కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. మోటో బడ్స్, మోటో బడ్స్+ పేరుతో రెండు మోడల్స్‌ను ఆవిష్కరించింది. మరి దీని ధర, ఫీచర్లు ఏంటో తెలుస్తుంది.
Moto Earbuds: Moto New Earbuds.. These are the features!
Moto Earbuds: ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ మోటో కొత్త ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. మోటో బడ్స్, మోటో బడ్స్+ పేరుతో రెండు మోడల్స్‌ను ఆవిష్కరించింది. 50dB, 46dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్‌తో ఆకర్షణీయమైన రంగుల్లో వీటిని తీసుకొచ్చారు. మోటో బడ్స్ ధర రూ.4,999గా కంపెనీ నిర్ణయించింది. కోరల్ పీచ్, గ్లేసియర్ బ్లూ, స్టార్‌లైట్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. త్వరలో మరిన్ని రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వాళ్లకి రూ.1000 డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్‌లో 12.4mm డ్రైవర్స్ అమర్చారు. 50dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉంది. కేస్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 42 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో రెండు గంటలకు పైగా వాడుకోవచ్చు.
మోటో బడ్స్+ ధర రూ.9,999గా కంపెనీ ప్రకటించింది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2 వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. బీచ్ సాండ్, ఫారెస్ట్ గ్రే రంగుల్లో ఇవి లభించనున్నాయి. ఇందులో 11mm వూఫర్, 6mm ట్వీటర్‌తో డ్యూయల్ డైనమిక్స్ డ్రైవర్లతో వస్తుంది. 46dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. పదినిమిషాల ఛార్జింగ్‌తో మూడు గంటలు వాడుకోవ్చు. మోటో బడ్స్+ కేసు వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. వీటికి యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. ఇవి ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.