SRD: జిల్లా వ్యాప్తంగా రక్త నిల్వలు కొరత ఏర్పడిన దృష్ట్యా, ఖేడ్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖేడ్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో 52 మంది దాతలు రక్తాన్ని ఇచ్చారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. రక్తదానం చేసిన వారిని ప్రశంసించారు.