JGL: మెట్పల్లిలో బాలుడు గాయపడటానికి కారణమైన చైనా మాంజాను సరఫరా చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్‌కు చెందిన ఎండీ. ఫిరోజ్ ఖాన్‌ను ప్రధాన సరఫరాదారుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి భారీగా నిషేధిత మాంజా రీల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.