TG: మేడారం జాతరకు ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు 50 శాతం అదనంగా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక పండగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు ఛార్జీలు పెంచుకునేందుకు RTCకి అనుమతి ఉంది. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. జాతరకు 3,495 బస్సులను సిద్ధం చేశారు. అవసరమైతే మరికొన్నింటిని నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.