KMM: సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్న సెల్ ఫోన్‌ను రికవరీ చేసి బాధితుడికి అందజేసినట్లు వేంసూరు ఎస్సై కవిత తెలిపారు. మండలానికి చెందిన పి. సతీష్ తన ఫోన్ పోయిందని గతంలో ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్సై, సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా ఫోన్‌ను ట్రేస్ అవుట్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో సతీష్‌కు ఫోన్‌ను అందజేశారు.