Spirit: ‘స్పిరిట్’ సాలిడ్ అప్డేట్.. మరి ‘సలార్ 2’ పరిస్థితేంటి?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ లైనప్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. కానీ ఏ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే.. తాజాగా స్పిరిట్ సినిమా పై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ.
Spirit : సలార్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న కల్కి మే 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇక కల్కి తర్వాత మారుతి ప్రాజెక్ట్ రాజాసాబ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ఏ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు? అనేది ఎగ్జైటింగ్ మారింది. ఇప్పటికే మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. కల్కి పార్ట్ 2 సంగతి పక్కన పెడితే.. సలార్ 2తో పాటు స్పిరిట్, హనురాఘవపూడి సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ముందుగా సలార్ 2 కంప్లీట్ చేసే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టుగా టాక్ ఉంది. దీంతో శౌర్యాంగ పర్వం తర్వాతే స్పిరిట్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు స్పిరిట్ అనుకున్న సమయానికి సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. లేటెస్ట్గా సందీప్ రెడ్డి వంగ.. స్పిరిట్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. బాలీవుడలో ఓ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్లాడు సందీప్ రెడ్డి.
ఈ సందర్భంగా.. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్‌తో స్పిరిట్ చేయబోతున్నానని చెప్పాడు. ఆ తర్వాతే అనిమల్ పార్క్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే.. ఈ సినిమా హార్రర్ కాదని.. స్పిరిట్‌లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్పిరిట్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. కానీ సలార్ 2 ఎప్పుడు ఉంటుందనేది.. ఇప్పుడు డైలమాలో పడిపోయింది. మరోవైపు.. హోంబలె ఫిలింస్ వారు 2025లో సలార్ 2 రిలీజ్ ఉంటుందని అంటున్నారు. కానీ ప్రశాంత్ నీల్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏదేమైనా.. స్పిరిట్ మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి.