తెలుగు నటి హేమకు MAA (మూవీ ఆర్ట్స్ అసోసియేషన్) కు విడదీయరాని సంబంధం ఉంది. MAA లో ఎప్పుడు ఎన్నికలు జరిగిన హేమ మార్క్ లేకుండా జరగలేదు. అలాంటి హేమకు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు దాపురించాయి. బెంగళూరులో ఒక ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఆమె అరెస్టు అయిన సంగతి తెలిసిందే. తర్వాత, మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (MAA) నుంచి నిషేధం విధించబడింది. MAA ఆమెను ” నిర్దోషిగా నిరూపించబడినంత వరకు నిషేధం కొనసాగుతుంది” అని స్పష్టం చేసింది.
హెమా ఇటీవల ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, తన డ్రగ్ టెస్ట్ రిపోర్టు నెగటివ్‌గా వచ్చినట్లు వెల్లడించారు. ఆమె ఆరోపణలను ఖండిస్తూ, ఈ సమాచారం పై MAA స్పందించి తనను నిషేధం నుంచి విముక్తి చేసే ప్రకటన చేసింది. ఆమె ప్రెస్ మీట్ తరువాత కేవలం 3 రోజుల్లో, MAA ఆమెపై ఉన్న నిషేధాన్ని రద్దు చేసింది. అయితే ప్రెస్ తో మాట్లాడకూడదని హేమకు MAA సంస్థ కండిషన్ పెట్టింది. దీనికి హేమ అంగీకరించి MAA కు ధన్యవాదాలు తెలిపారు.