తెలుగు సినిమా రంగంలో “మాస్ మహరాజా”గా గుర్తింపు పొందిన రవి తేజKolkata Rape Case Update: పోలీసులు ఆధారాలను మార్చేశారు: సీబిఐ పై అభిమానులు చాలా ప్రేమతో ఉంటారు. అయితే, ఇటీవలే ఆయన 75వ సినిమాకు సంబంధించిన సెట్స్ లో ఒక తీవ్ర గాయం జరిగింది, దీనితో అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. రవి తేజ ప్రస్తుతం భోగవరపు భాను దర్శకత్వంలో రూపొందుతున్న తన 75వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ, సెట్స్ లో కొన్ని ప్రమాదకరమైన సన్నివేశాల కారణంగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో, రవి తేజకు గోప్యంగా చికిత్స అందించారు.
ఇటీవల కాలంలో సినిమాల్లో భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రవి తేజ, తన 75వ సినిమా కోసం ఆక్షన్ సబ్జెక్టు ను ఎన్నుకున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణలో గాయమైంది. యశోదాలో డాక్టర్లు రవితేజకు శస్త్రచికిత్స చేసి ఆరు వరాల బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు.
ఈ స్ధితిలో, అభిమానులు రవి తేజకు త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆయన త్వరలోనే పూర్తిగా నయం కావాలని, అలాగే ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి కావాలని అందరు ఆశిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధం లేని ఒక పాత చిత్రం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. అది గతంలో టచ్ చేసి చూడు సినిమా టైములో రవితేజకు గాయమైన ఫోటో అని పలువురు క్లారిటీ ఇచ్చారు