2025 సంక్రాంతి హుంగామకు తెలుగు సినీ పరిశ్రమ సిద్ధంగా ఉంది. సంక్రాంతికి తెలుగు సినిమాల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చే సంక్రాంతికి అనేక ప్రతిష్టాత్మక చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి, వీటిలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, వెంకటేష్- అనిల్ రావిపూడి సినిమా, బాలకృష్ణ- బాబీ కొల్లి సినిమా, రవి తేజ 75వ చిత్రం పేర్లు వినిపిస్తున్నాయి.
1. చిరంజీవి ‘విశ్వంభర’: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా సంక్రాంతి 2025 పండుగకు రిలీజ్ కానుంది. చిరంజీవి తన పాత శైలిలో వస్తున్న ఈ చిత్రం, అభిమానులను అలరించేలా ఉంటుందని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. బింబిసార డైరెక్టర్ వసిస్ట్ ఈ సినిమాకు దర్శకుడు. బింబిసార బ్లాక్ బస్టర్ తరువాత బాస్ తో చేయబోయే సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బన్నేరుపై సినిమాను నిర్మిస్తున్నారు
2. వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమా: అగ్ర కథానాయకుడు వెంకటేష్, వరుస హిట్లతో మంచి ఊపుమీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి కంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా SVC బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. F2, F3 తరువాత హిట్ కంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఈ సినిమాల్లో ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు.
3. బాలకృష్ణ ‘NBK 109’: నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వంలో 109వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య కి సంక్రాతి అంటే ప్రత్యేకమని చెప్పాలి. బాలయ్యకు శంకర్నాటి రిలీజ్ అయిన సినిమాలు ఎన్నో హిట్స్ అందించాయి. వీరసింహ రెడ్డి కూడా 2022 లో సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది
4. రవితేజ RT 75: రవి తేజా, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో కలిసి ‘RT 75’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా సంక్రాంతి 2025 కు విడుదల చేయాలనీ భావిస్తున్నారు. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ బాలయ్య సినిమా కూడా సంక్రాంతికే రానుండడంతో ఈ సినిమా వాయిదా వేసే చాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ లో విడుదల చేయాలని ఇంకో ఆలోచన కూడా ప్రొడ్యూసర్లకు ఉంది.
మొత్తానికి 4 సినిమాలు 2025 సంక్రాంతికి నువ్వా నేనా అన్నట్టు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఆ టైం వచ్చేసరికి ఎన్ని రిలీజ్ అవుతాయో చూడాలి.