హాలీవుడ్ లో డిస్నీ సంస్థ సూపర్ హిట్ ‘ది లయన్ కింగ్’ ఫ్రాంచైజ్ లోకి మహేష్ బాబు అడుగుపెట్టాడు. ‘ముఫాసా: ది లయన్ కింగ్’కు మహేష్ బాబు తన తెలుగు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. ‘ద లయన్ కింగ్’ సిరీస్ అంటే హై లెవెల్ టెక్నికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండే ఒక అద్భుతమైన సిరీస్, విజువల్‌గా ఆకట్టుకునే ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ లో వస్తున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాకు, మహేష్ బాబు తన వాయిస్ తో ముఫాసా పాత్రకు తెలుగు వెర్షన్ కి జీవం పొయనున్నాడు. ఇది తెలుగు రాష్ట్రాలలో ‘లయన్ కింగ్’ సినిమాకు పెద్ద ప్రోత్సాహం అనే చెప్పాలి.
మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక కీలకమైన అంశం. ఇది తెలుగువారికి మరింత ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇప్పటివరకు హిందీ వర్షన్లలో ప్రముఖులైన షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ముఫాసా పాత్రకు తమ వాయిస్ అందించారు. ఈ ప్రతిష్టాత్మక పాత్రకు మహేష్ బాబు తన తెలుగు వాయిస్ ఇచ్చే ఛాన్స్ కొట్టాడంటే మాములు విషయం కాదనే చెప్పాలి.
‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు ట్రైలర్ ఆగస్టు 26న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనుంది డిస్నీ సంస్థ. ఈ ట్రైలర్ విడుదలతో, తెలుగు ప్రేక్షకుల మధ్య ఎగ్జైట్మెంట్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. మహేష్ బాబు వాయిస్ తో ముఫాసా పాత్ర మరింత సజీవంగా, ఆకర్షణీయంగా మారనుంది. మహేష్ కు వాయిస్ ఓవర్ కొత్త కాదు. జల్సా, బాద్షా, ఆచార్య ఇలా ఎంతోమంది స్టార్ల సినిమాలకు మహేష్ తన వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాకు ఇస్తున్న న్యూస్ ఫ్యాన్స్ కి పండగలాంటి వార్త