VZM: పట్టణ పేదలకు నివాసం ఉన్న చోటే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇల్లులేని వారికి 2 సెంట్లు భూమి కేటాయించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 24న ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు తెలిపారు. LBG భవనంలో గోడ పత్రికను ఇవాళ ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు హామీ ఇచ్చిన ఇళ్లు, భూములు ఇవ్వకపోవడం ప్రభుత్వ చెతగాని తనంగా విమర్శించారు.