MBNR: భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని దేవరకద్ర శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ విలువను ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ప్రధాని ట్రంప్ వద్ద తాకట్టు పెట్టారని పేర్కొన్నారు.