ASR: డుంబ్రిగూడలోని చాపరాయి సమీపంలో బుధవారం సాయంత్రం ఎస్సై పాపి నాయుడు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించి, ప్రయాణంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే ప్రతి ఒక్కరు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని ఎస్సై సూచించారు.