దేశ ప్రజల కోసం రక్తాన్ని, ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తి ఇందిరా గాంధీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ‘గరీబీ హఠావో’ నినాదంతో ఆమె పేదరికాన్ని పారదోలారని, నిరుపేదలకు భూములు పంచిన ఘనత ఆమెకే దక్కుతుందని కొనియాడారు. ‘దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఒక్క బీజేపీ నేతనైనా ఉన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు.