BHNG: నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డైయిరీ సంస్థ పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించాలని బుధవారం రాజాపేట మండలం పారుపల్లి పాడి రైతులు పాల కేంద్రం వద్ద నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే 8 పాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, బిల్లులు చెల్లించకపోవడంతో పశుపోషణతో పాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.