హైదరాబాద్ మెట్రో ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం, L&T సంయుక్తంగా నిర్వహించింది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 50:50 వాటాలతో జాయింట్ వెంచర్ రూపంలో మెట్రో నిర్వహణను చేపడతాయని, బలపరచిన PPP మోడల్లో ఇరు ప్రభుత్వాలు కలిసి మెట్రో కార్యకలాపాలు, నిధుల సమీకరణ, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను పర్యవేక్షించనున్నాయి.