ATP: గుత్తి మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో బుధవారం పిల్లలపై లైంగిక దాడుల నిరోధంపై మండల స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీడీ అధికారి డాక్టర్ నారాయణస్వామి మాట్లాడుతూ.. పిల్లలపై జరిగే లైంగిక దాడుల గుర్తింపు, నివారణ, తక్షణ స్పందన, చట్టపరమైన విధానాలు, పిల్లల సంరక్షణలో ప్రతి శాఖ అధికారులకు అవగాహన కలిగించారు.