KMMl: ఇందిరా గాంధీ జయంతి వేడుకలు బుధవారం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఇందిరమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.