MNCL: వరి ధాన్యంలో నిర్దేశిత ప్రమాణంలో తేమ శాతం ఉంటేనే వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుందని జన్నారం మండలంలోని పోన్కల్ క్లస్టర్ ఏఈవో త్రిసంధ్య తెలిపారు. బుధవారం ఆమె మార్కెట్ యార్డ్లో రైతులు ఎండకు ఆరబోసిన వరి ధాన్యాన్ని బుధవారం పరిశీలించారు. దాన్యంలో తాలు లేకుండా చూసుకోవాలని, 17% తేమ ఉండేలా సరిచూసుకొని కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలన్నారు.