ఒడిశా సినీపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ హ్యూమన్ సాగర్(36) కన్నుమూశాడు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కుమారుడి ఆరోగ్యం బాగా లేకున్నా.. అతని మేనేజర్ బలవంతంగా ప్రదర్శన ఇప్పించారని, దాంతో అతని ఆరోగ్యం మరింత క్షీణించిందని సాగర్ తల్లి ఆరోపించింది.