భారతదేశం వల్లే తన తల్లి ప్రాణాలతో ఉందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్వాజేద్ తెలిపారు. భారత్ ఎప్పుడూ మిత్ర దేశంగా ఉందని, సంక్షోభ సమయంలో తన తల్లి దేశం వీడకపోయి ఉంటే మిలిటెంట్లు ఆమె హత్యకు కుట్రలు చేసేవారని చెప్పారు. తన తల్లి ప్రాణాలు కాపాడిన ప్రధాని మోదీకి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని పేర్కొన్నారు.