SS: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ డ్రమ్స్ విద్వాంసుడు శివమణి తన డ్రమ్స్ ప్రదర్శనతో భక్తులను, అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నారు. కాగా ఈ ఉత్సవాలకు ప్రముఖ క్రికెటర్ సచిన్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్, తదితరులు హాజరయ్యారు.