ASF: విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆసిఫాబాద్ జిల్లా ఆదనపు కలెక్టర్, ఇంఛార్జ్ విద్యాశాఖాధికారి దీపక్ తివారీ సూచించారు. బుధవారం కాగజ్ నగర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. అనంతరం విద్యా బోధన, వసతుల కల్పన, మధ్యాహ్న భోజన నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.