TG: iBOMMA రవి అరెస్ట్‌పై హోంశాఖ స్పెషల్ CS CV ఆనంద్ స్పందించారు. iBOMMAతో పైరసీ ఆగుతుందా అని నెట్టింట వచ్చిన పోస్ట్‌కు ఆయన సమాధానమిచ్చారు. ‘ఒకడు పోతే మరొకడు వస్తాడు, అది ఇంకా అధునాతనంగా. కొందరిని అరెస్టు చేశామన్న కారణంతో పైరసీ, సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం అత్యాశ. మన చేతిలో ఉన్నది ఒక్కటే- నివారణ’ అని పేర్కొన్నారు.