AP: పుట్టపర్తిలోని సత్యసాయి శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ వేడుకలకు హాజరై మాట్లాడారు. గతంలో సత్యసాయి బాబాను ఎన్నోసార్లు కలిశానని గుర్తుచేసుకున్నారు. తనను బాబా ఎన్నో ప్రశ్నలు అడిగేవారని, బాబా తనను ఆశీర్వదించి.. దిశానిర్ధేశం చేసే వారని పేర్కొన్నారు. బాబా ఎప్పుడూ నిస్సహాయులకు అండగా ఉండేవారని తెలిపారు.