Gold Rates Today : ఒక్కరోజే వేలల్లో తగ్గిన వెండి, బంగారం ధరలు!
గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న వెండి, బంగారం ధరలు శుక్రవారం ఒక్కరోజే భారీగా పెరిగాయి. అయితే ఆ పెరిగిన దాని కంటే ఎక్కువగా ఈ రోజు వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడి, వెండి రేట్లు శనివారం భారీగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఐదారు రోజులుగా తగ్గుతూ ఊరించిన వీటి ధరలు శుక్రవారం ఊహించని రీతిలో భారీగా పెరిగిపోయాయి. అయితే అంతకు మించిన భారీగా శనివారం వీటి ధరలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర నేడు రూ.2000 తగ్గింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ.73,600కు చేరుకుంది. ఇది మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్న ధర అని గుర్తుంచుకోవాలి. తర్వాత దీని ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం , హైదరాబాద్, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ..73,600గా కొనసాగుతోంది. కొనుగోలుదారులు నగల్ని కొనుక్కునేప్పుడు ఈ ధరకు తోడుగా జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate)లు సైతం శనివారం భారీగా తగ్గాయి. శనివారం ఒక్క రోజే ఏకంగా రూ.4,716 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర నేడు రూ.90,789కు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో సైతం స్పాట్ గోల్డ్, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. శనివారం ఔన్సు స్పాట్ గోల్డ్ ధర ఏకంగా 85 డాలర్లు తగ్గింది. దీంతో 2,294 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి ధర ప్రస్తుతం 29.23 డాలర్లుగా ఉంది.