AP: నదీ జలాల పంపకాల విషయమై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు.. హక్కులు వేరని స్పష్టం చేశారు. హక్కుల విషయంలో తలొగ్గేది లేదని వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2020లోనే ఆగిందన్నారు. రాయలసీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు. అనుమతులు లేకుండా పనులు చేపట్టడం వల్లనే పనులు నిలిచిపోయాయనే విషయాన్ని గుర్తు చేశారు.