MNCL: దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో వ్యాపారులు చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని దండేపల్లి ఎస్సై తహసీనుద్దీన్ హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ మాంజా వాడితే మనుషులు, వన్యప్రాణులు, పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. మండలంలో వ్యాపారులు ఎవరూ చైనా మాంజా అమ్మ వద్దని ఎస్సై సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసులు నిఘా పెట్టారన్నారు.