VZM: ఎల్కోట మండలం గనివాడలో సర్పంచ్ రవ్వ శివశంకర్ అధ్యక్షతన సోమవారం జరిగిన ఉపాధి హామీ గ్రామసభలో ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉపాధి హామీ 2005 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్చిన జీ రామ్ జీ 2025 చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉపాధి వేతనం ధరలు ఈ చట్టాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీవో విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.