»A Statue Of Ramoji Rao Should Be Installed In Amaravati Deputy Cm Pawan Kalyan
Pawan Kalyan: అమరావతిలో రామోజీ రావు విగ్రహం పెట్టాలి
ఈనాడు గ్రూప్ ఛైర్మెన్ దివంగత రామోజీ రావు సంస్మరణ సభను విజవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడు. ఆయన విగ్రహాన్ని నూతన రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
A statue of Ramoji Rao should be installed in Amaravati.. Deputy CM Pawan Kalyan
Pawan Kalyan: రామోజీరావుకు ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గురువారం రామోజీ రావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసింది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభలో పాత్రికేయులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఏపీలోని విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… రామోజీరావు అంటేనే ఓ నిబద్దత అని పేర్కొన్నారు. 2008లో ఆయన్ను మొదటి సారి కలిశానన్నారు. ఆ సమయంలో ఆయన మాట్లాడే విధానం చాలా ఆకర్షించిందని, ఎప్పుడు మాట్లాడినా ప్రజా సంక్షేమమే ఉండేదని అన్నారు. ఆయన సంఘంలో ఉన్న ఎన్నో సమస్యలపై పోరాటం చేశారని, ఎన్నడు జర్నలిజం విలువలను వీడలేదని చెప్పారు. ప్రభుత్వంలో ఏం జరిగినా కచ్చితంగా ప్రజలకు తెలియాలని, అందుకు పత్రికకు స్వేచ్చ ఎంత అవసరమో మాట్లాడేవారని వెల్లడించారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల గురించే పత్రికలో రాసేవారని.. అలాంటి వ్యక్తిని ఎప్పుడు గుర్తించుకోవాలన్నారు. అందుకే అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలి అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.