»Film Shootings On Sunday Are Bandh To Mourn The Death Of Ramoji Rao
Ramoji Rao: ఆదివారం సినిమా షూటింగ్లు బంద్
రామోజీ రావు మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కళారంగానికి ఆయన చేసిన సేవకు కృతజ్ఞతగా రేపు షూటింగులు నిలిపివేస్తున్నట్లు నిర్మాతల మండలి శనివారం ప్రకటించింది.
Film shootings on Sunday are bandh to mourn the death of Ramoji Rao
Ramoji Rao: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మరణంపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యంగా సినీ ప్రముఖుల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు షూటింగులో పాల్గొన్న వారందరు సెట్లోనే రామోజీ ఫోటో పెట్టుకొని నివాళులు అర్పించారు. చిత్ర పరిశ్రమకు రామోజీ రావు ఎంతో సేవా చేశారు, ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని సీనియర్ నటులు, నిర్మాతలు వ్యాఖ్యానించారు. పేపర్ ఇండస్ట్రీ నుంచి ఎలాక్ట్రానిక్ మీడియాతో సహా పలు సినిమాలు నిర్మించి మంచి సినిమాలు రూపొందించారు. ఆయన్ను కడసారి చూడడానికి ఫిల్మ్ సిటీకి ప్రముఖ నటులు మోహన్ బాబు, నరేశ్, కల్యాణ్ రామ్, సాయికుమార్, దర్శకులు రాఘవేంద్రరావు, రాజమౌళి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కీరవాణి తదితరులు వచ్చారు.
ఆయన మరణంపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి విచారం వ్యక్తపరిచింది. సినిమా రంగానికి, టీవీ రంగానికి రామోజీరావు ఎంతో సేవ చేశారని వారు గుర్తుచేస్తున్నారు. రామోజీరావు పత్రికారంగంలో ఎనలేని సేవా చేశాడు. కానీ సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు కాదనలేనివి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపంగా ఆదివారం సినిమా షూటింగ్ లు అన్నీ నిలిపేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటిస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.