ఈనాడు గ్రూప్స్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. దిగ్గజ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సైతం ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపి రామోజీ రావుకు అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై అల్లు అర్జున్ సైతం స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
Allu Arjun reacts to Rajamouli's tweet to give Bharat Ratna to Ramoji Rao
Ramoji Rao: ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల ప్రపంచ నలుమూల నుంచి ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో నివాళులు అర్పిస్తూ రామోజీ రావుకి భారతరత్న ఇవ్వడం తెలుగు వాడికి ఇచ్చే గౌరవం అని పేర్కొన్నారు. దీనిపై తాజాగా అల్లు అర్జున్ సైతం స్పందించారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
“ఒక వ్యక్తి 50 ఏళ్ల ప్రయాణంలో అనేక రంగాల్లో ఎన్నో సంస్థలను స్థాపించి, ఎంతో మందికి జీవనోపాధి కల్పించడం అనేది మాములు విషయం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రామోజీరావు సమాజ ఉన్నతికి పాటుపడ్డాడు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే సరియైన నివాళి అవుతుంది అని రాజమౌళి ట్వీట్ చేశారు. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ “నా మనసులో కూడా అదే భావన ఉంది. నా మనసులోని మాటను మీరు చెప్పారు అంటే రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.