»Ramoji Rao Samadhi While Still Alive Do You Know Why
Ramoji Rao: బతికుండగానే రామోజీ రావు సమాధి.. ఎందుకో తెలుసా?
గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే బతికుండగానే సమాధిని ఏర్పాటు చేసుకున్నారు రామోజీ రావు.
Ramoji Rao Samadhi while still alive.. Do you know why?
Ramoji Rao: అనారోగ్యంతో మరణించిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రామోజీ రావు అంత్యక్రియలు ఆదివారం రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య తెలంగాణ రాష్ట్ర అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిల్మ్ సిటీ నివాసంలో ఉంచారు. ఇక రామోజీరావు గురించి అందరికీ తెలిసిందే. దేశంలో ఆయనంటే తెలియని వారు ఉండరు. ప్రింట్ మీడియాలో నూతన ఒరవడి సృష్టించారు. అలాగే.. సినిమా రంగంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక రామోజీ ఫిలిం సిటీని ప్రపంచం మొత్తం చూసేలా చేశారు రామోజీ.
అక్కడే తన సమాధి కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో స్మారకం ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు. ఆయనకు మొక్కలంటే చాలా ఇష్టమట. అందుకే.. తన సమాధి ప్రాంతాన్ని ఓ ఉద్యానవనంలా మార్చాలనేదే రామోజీ కోరిక అని తెలుస్తోంది. రామోజీ సమాధి గురించి మోహన్ బాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎప్పుడు కలిసినా సరే.. రెండు గంటల పాటు కదలనిచ్చేవారు కాదు. రండి, నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది.. చూద్దురు అనేవారు. మిమ్మల్ని పలకరించడానికి వచ్చాను కానీ, మీ సమాధిని చూడడానికి కాదని చెప్పేవాడినని.. అని గుర్తు చేస్తుకున్నారు.