»These Are The Rules That Will Change From October 1 Alert To Them
New Rules: అక్టోబర్ 1 నుంచి మారే రూల్స్ ఇవే..వారికి అలర్ట్
ప్రతి నెలా కొన్ని రూల్స్ మారుతుంటాయి. కొత్త రూల్స్ అమలోకి వస్తుండటం అందరికీ తెలిసిందే. తాజాగా అక్టోబర్ నెలలో కూడా ఆర్థిక రంగంతో పాటుగా మరికొన్ని రంగాల్లో కీలక మార్పులు జరిగాయి. వాటి ఆధారంగా కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. మరి అవేంటో ఓసారి తెలుసుకుందాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి ((SSY), పోస్టాఫీసు డిపాజిట్లు వంటి స్కీమ్స్‌లో డబ్బులు పొదుపు చేసేవారు సెప్టెంబర్ 30వ తేదిలోపు తమ ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే గడువు తర్వాత స్మాల్ సేవింగ్స్ అకౌంట్స్ (Small savings Accounts) అన్నీ ఫ్రీజ్ అవుతాయని కేంద్రం హెచ్చరించింది.
కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్ల (2000 Notes)ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ రూ.2 వేల నోటును చలామణీ నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే సెప్టెంబర్ 30వ తేదిలోపు రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు చివరి అవకాశం ఇచ్చింది. గడువు తర్వాత ఆ కరెన్సీ నోట్లు చెల్లవని ఆర్బీఐ (RBI) హెచ్చరించింది.
దేశంలో అక్టోబర్ 1 నుంచి జనన, మరణాల నమోదు సవరణ చట్టం అమలులోకి రానున్నట్లు ప్రకటించింది. విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేందుకు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు, ఓటరు కార్డు నమోదుకు, ఆధార్ కార్డును పొందేందుకు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు బర్త్ సర్టిఫికెట్ (Birth Certificate)ని సింగిల్ డాక్యుమెంట్‌గా వాడొచ్చు.
ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ ఉన్నవారు సెప్టెంబర్ 30వ తేదిలోపు కచ్చితంగా తమ నామినీని జతచేయాలని ఆర్థిక శాఖ వెల్లడించింది. నామినేషన్ వివరాలను అప్డేట్ చేయకపోతే సెబీ మార్గదర్శకాల ప్రకారంగా ట్రేడింగ్ ఖాతాలను ఫ్రీజ్ చేయనున్నట్లు హెచ్చరించింది. ఇన్వెస్ట్మెంట్లు, అసెట్లను కాపాడుకునేందుకు కచ్చితంగా నామినేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
అక్టోబర్ 1వ తేది నుంచి క్రెడిట్ కార్డులను (Credit Cards) వినియోగించి విదేశాల్లో ఖర్చులు చేస్తే వాటిపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొత్త ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ అమలులోకి రానుంది. విదేశీ క్రెడిట్ కార్డులపై ఖర్చులు రూ.7 లక్షలు దాటితే 20 శాతం టీసీఎస్ వర్తిస్తుంది. ఒక వేళ వైద్య, విద్య కోసం ఖర్చు చేస్తే టీసీఎస్ (TCS) 5 శాతం ఉంటుంది.