»Good News For The Residents Of Hyderabad Metro Services Till Midnight Tomorrow
Metro: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. రేపు అర్ధరాత్రి వరకూ మెట్రో సేవలు
న్యూ ఇయర్ సందర్భంగా రేపు అర్దరాత్రి వరకూ మెట్రో సెవలు కొనసాగుతాయని, మద్యం సేవించి మెట్రోలో ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్ మెట్రో ఎండీ వెల్లడించారు.
న్యూ ఇయర్ సందర్భంగా రేపు అర్ధరాత్రి వరకూ మెట్రో సేవలు కొనసాగుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రేపు రైలు సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. రేపు ఆఖరి మెట్రో రైలు తొలి స్టేషన్ నుంచి అర్ధరాత్రి దాటాక 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంటకు చివరి స్టేషన్ కు చేరుకుంటుందని, ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.
మెట్రో ట్రైన్లలోనే కాకకుండా మెట్రో స్టేషన్ల వద్ద కూడా పోలీసులతో గట్టి నిఘా ఉంటుందని, మద్యం తాగి వచ్చినా, తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టినా, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని మెట్రో వినియోగదారులు గుర్తించుకోవాలని, ఎవ్వరూ మద్యం సేవించి మెట్రోలో ప్రయాణించేందుకు సాహసించకండని హెచ్చరించారు.
ఇకపోతే సూపర్ సేవర్ మెట్రో హాలీ డే కార్డు జనవరి 1వ తేదీన పనిచేస్తుందని, కేవలం రూ.59కే రీఛార్జ్ చేయించుకున్న తర్వాత రోజంతా హైదరాబాద్ మొత్తం ఎన్ని ట్రిప్పులైనా ప్రయాణించవచ్చని వెల్లడించారు. కొత్త సంవత్సరం రోజున ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్లోని దర్శనీయ ప్రదేశాలకు వెళ్లేందుకు హాలీ డే కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.