Chandu Sai: యూట్యూబర్, నటుడు చందుసాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. చందుసాయి ప్రేమ పేరుతో ఆ యువతికి దగ్గరయ్యాడు. తన పుట్టిన రోజు వేడుకకు పిలిచి అత్యాచారం చేశాడు. ఎప్పుడు పెళ్లి మాట ఎత్తిన ముఖం చాటేశేవాడని తెలిపింది. చివరికి మోసపోయానని తెలిసి పోలీసులను ఆశ్రయించింది.
Narsingi police arrest YouTuber Chandu Sai for alleged 'rape and cheating' on the pretext of marriage and false promises pic.twitter.com/K3j337MyCa
మోసం చేసి, అత్యాచారం చేసినందుకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ‘రేప్ అండ్ చీటింగ్’ కేసులో అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ ఖైదీగా చంచలగూడ జైలుకు తరలించినట్లు నార్సింగి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. చందుతోపాటు అతడి తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. చందుసాయి అసలు పేరు చంద్రశేఖర్ సాయి కిరణ్. యూట్యూబ్‌లో చందుగాడు పేరుతో ఫేమస్ అయ్యాడు. చందుగాడు, పక్కింటి కుర్రాడుగా వీడియోలు చేస్తూ.. డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. చందు యూట్యూబ్ ఛానల్‌కు అయిదున్నర లక్షలకుపైగా సబ్‌స్కైబర్స్ ఉన్నారు.
Arrested Youtuber Chandu Sai shifted to Chanchalguda jail.
Narsingi Assistant Commissioner of Police said he was produced in the court in the alleged 'rape and cheating' case and shifted to prison as remand Khaidi.