»Ap Cid Registered Fir Against Chandrababu And Nara Lokesh In Land Titling Case
Land Titling Case: టీడీపీ అధినేతకు ఈసీ షాక్.. చంద్రబాబు, నారా లోకేష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది . ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఫేక్ ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. FIRలో A1గా చంద్రబాబు నాయుడు, A2గా నారా లోకేష్ పేర్లను చేర్చింది.
AP CID registered FIR against Chandrababu and Nara Lokesh in land titling case
Land Titling Case: టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఫేక్ ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతో వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చంద్రబాబును A1గా, A2గా నారా లోకేష్ పేర్లను చేర్చింది. వీరిద్దరితో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేసింది. IVR కాల్స్ చేసిన ఏజెన్సీపైనా కూడా ఎఫ్ఐఆర్ అయింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై IVR కాల్స్‌తో తెలుగుదేశం పార్టీ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోందని వైసీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల కమిషన్‌కు మే 4వ తేదీన ఫిర్యాదు చేశారు.
ఆ యాక్ట్ ద్వారా భూములు లాక్కొబోతున్నారని, జగన్‌కు ఓటు వేయొద్దంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో విష్ణు పేర్కొన్నారు. కాల్లో చెప్పే విషయాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు విష్ణు ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. IVR కాల్స్‌ను పరిగణలోకి తీసుకుని.. తప్పుడు ప్రచారాన్ని నిలిపివేసేలా ఆదేశాలించాలని విష్ణు కోరారు. విష్ణు ఇచ్చిన ఫిర్యాదులో విచారణ చేపట్టిన అధికారులు సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్లో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.